ఉగాది కి విడుదల కానున్న 'బాహుబలి2' ట్రైలర్‌

ఉగాది కి విడుదల కానున్న 'బాహుబలి2' ట్రైలర్‌

ఉగాది సందర్భంగా 'బాహుబలి2' ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ట్రైలర్ ఔట్‌పుట్ కోసం సీవీ రావు, శివకుమార్‌లు సీరియస్‌గా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇదిలావుండగా రాజమౌళితో కలిసి సెంథిల్ పనిచేయడం ఏడోసారి. యమదొంగ, మగధీర, ఈగ వంటి సినిమాలకు పనిచేశాడు. ఇండస్ట్రీలో పేరున్న సినిమాటోగ్రాఫర్లలో సెంథిల్ కుమార్ ఒకరు.

Back to Top