వీసా నిబంధనలు సడలించండి కెనడాకు భారత్ విజ్ఞప్తి
- March 04, 2017
వీసా నిబంధనలను సరళతరం చేయాలంటూ భారత ప్రభుత్వం కెనడాకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల కెనడా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినం చేసింది. దీంతో భారతీయ కంపెనీలు కెనడాలోని తమ యూనిట్లకు ఉద్యోగులను పంపడం కష్టంగా మారింది. ఈ పరిణామం వాణిజ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలువురు వ్యాపారవేత్తలు ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారి వినతుల మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కెనడా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి ప్రాంకోయి్‌సతో నిర్మలా సీతారామన్ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
కెనడాలోని తమ యూనిట్లలో పనిచేసేందుకు పలువురు ఉద్యోగులను భారతీయ కంపెనీలు షార్ట్ టర్మ్ వీసాపై పంపుతుంటాయిని, కెనడా ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనలతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్మలా సీతారామన్ వివరించారు. దీనికి స్పందించిన కెనడా మంత్రి.. వీసా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ స్కిల్ సా్ట్రటజీ ప్రోగ్రాం కింద సాంకేతిక నిపుణులు, పరిశోధకుల వీసా దరఖాస్తులను రెండు వారాల్లో పరిష్కరిస్తున్నామని, అలాగే ఏడాదిలోపు మాత్రమే కెనడాలో ఉండే ఉద్యోగుల వీసా దరఖాస్తులనూ వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







