ఆస్ట్రేలియా పర్యాటకులకు చేదు వార్త
- March 04, 2017
క్వీన్స్లాండ్ టూరిజం ఇండస్ట్రీ కౌన్సిల్ త్వరలోనే పర్యాటకులపై ఛార్జీల భారం మోపబోతోంది. హోటళ్ళు, మోటెల్స్, బెడ్, బ్రేక్‌ఫాస్ట్, హాలిడే పార్కులు, క్యాంప్ సైట్లు, ఇతర వసతుల్లో సేవలకు బిల్లుపై ఒక రాత్రికి 5 శాతం చొప్పున ఛార్జీలు విధించాలనే అంశం పరిశీలనలో ఉంది. ఎయిర్‌బీఎన్‌బీ వంటి ఆన్లైన్ ప్రొవైడర్ల ద్వారా చేసే బుకింగ్స్ కూడా ఈ విధంగా ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. నోవోటెల్ బ్రిస్బేన్‌లో ఓ గదికి ఓ రాత్రికి 8.95 డాలర్లు, సౌత్పోర్ట్లోని మెరిటన్ సర్వీస్డ్ అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్కు 10.20 డాలర్లు ఛార్జీ విధించే అవకాశం ఉంది. కూలం బీచ్ హాలిడే పార్క్‌లో కేబిన్‌కు 8.90 డాలర్లు, హామిల్టన్ ఐలండ్ బంగళాకు నలుగురికి 20 డాలర్లు, బ్రిస్బేన్‌లోని స్టామ్‌ఫర్డ్ ప్లాజాలో ఒక సూట్‌కు 75.25 డాలర్లు ఛార్జీ విధించవచ్చు.ఈ ఛార్జీల విధింపుపై టూరిజం ఆపరేటర్లతో కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. అయితే టూరిజం విట్సండేస్ ఈ ఆలోచనను విమర్శించింది. అనేక ఇతర మార్గాలు ఉండగా ఈ విధంగా ఛార్జీలను వడ్డించాలనుకోవడం సహేతుకం కాదని విట్సండేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెయిగ్ టర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







