జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్
- March 05, 2017
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ను మంజూర్ అహ్మద్‌గా గుర్తించారు.
ఆ ప్రాంతంలో ఉన్న నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో అకిబ్ మోల్వితో పాటు మరో హిజ్బుల్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కిన భవనాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







