సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!

- March 06, 2017 , by Maagulf
సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!

బాలీవుడ్ మొత్తాన్ని కొన్ని క్యాంప్స్ మాత్రమే కబ్జా చేశాయంటున్నాడట ఆ వెర్సటైల్ హీరో. తాను నటుడిగా నిలదొక్కుకోలేకపోవడానికి కారణం.. ఆ క్యాంప్ రాజకీయాలే అంటూ మండి పడుతున్నాడట.
రెండున్నర దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద లీడ్ హీరోగా దుమ్మురేపాడు గోవిందా. తనదైన డాన్సులతో.. కామెడీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్న ఈ వెర్సటైల్ హీరో.. రాజకీయాలలో బిజీ అయ్యి సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ నుండి సినిమాలపై దృష్టిపెట్టి అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినా అవేమీ గోవిందాకి మునుపటి క్రేజ్ ను మాత్రం తీసుకురాలేక పోయాయి. అయితే తాను మళ్లీ నటుడిగా నిలదొక్కుకోకపోవడానికి అసలు కారణం.. బీటౌన్‌లో ఉన్న క్యాంప్ రాజకీయాలే అంటూ పెద్ద బాంబ్ పేల్చాడు గోవిందా.
బాలీవుడ్ అంతా ఇప్పుడు గ్రూప్స్‌గా మారిపోయిందని, ఎవరైనా ఆయా గ్రూపులతో టచ్‌లో ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయని, లేకపోతే ఆ కథానాయకుల పరిస్థితి అంతే అంటూ బీటౌన్ క్యాంప్ రాజకీయాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు గోవిందా. ఇంతకీ విషయమేమిటంటే చాలారోజుల తర్వాత గోవిందా సోలో హీరోగా 'ఆగయా హీరో' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు.. రచయిత, నిర్మాత కూడా గోవిందానే.
'ఆగయా హీరో' సినిమా రూపొందించడానికి గోవిందా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందట. తాను ఏ క్యాంప్‌కి చెందినవాడు కాదు కాబట్టి.. తన సినిమాకి పనిచేయడానికి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎవరూ ముందుకు రాలేదట. చివరకు రచన చేయమని కొంతమంది అగ్ర రచయితలను సంప్రదిస్తే వారు డిమాండ్ చేసిన అమౌంట్ చూసి ఖంగుతిన్నాడట ఈ వెర్సటైల్ యాక్టర్. దాంతో తానే రచయితగా రంగంలోకి దిగి సినిమాని పూర్తి చేశాడట. ఇక చివరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో అతనికి ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదట. అందుకే.. అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేక, పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడట గోవిందా. ఫైనల్‌గా అన్ని అడ్డంకులు దాటుకుని గోవిందా తన సినిమాను ఈనెల 17న విడుదల చేస్తున్నాడు. మరి ఒకప్పుడు బాలీవుడ్ ఆడియెన్స్‌ని తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసిన గోవిందా ఇప్పుడు 'ఆగయా హీరో'తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com