అమెరికాలో తెలుగు యువతిపై కాల్పులు!

- March 06, 2017 , by Maagulf
అమెరికాలో తెలుగు యువతిపై కాల్పులు!

అమెరికాలో పదిరోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ తెలుగు యువతిపై దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాలిఫోర్నియా సమీపంలోని ఫ్రామెఔట్‌లో నివసిస్తున్న జ్యోతి అనే యువతి షాపింగ్‌కు కార్‌లో వెళ్లి పార్కింగ్ చేసి వస్తుండగా ఓ నల్లజాతీయుడు అడ్డుకుని కాల్పులు జరిపినట్లు తెలిసింది. జ్యోతి చేతికి గాయం అవడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. జ్యోతిది వరంగల్ జిల్లా అని తెలిసింది. ఈ ఘటన కూడా జ్యాత్యహంకార దాడే అని కొందరు అంటుండగా, దుండగుడు డబ్బుల కోసం కాల్పులు జరిపాడని మరికొందరు చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com