రెండో పెద్ద ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన చైనా

- March 06, 2017 , by Maagulf
రెండో పెద్ద ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన చైనా

భారత సరిహద్దులో రెండో అతి పెద్ద ఎయిర్ పోర్టు టెర్మినల్‌ను చైనా సోమవారం ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోని టిబెట్‌లో దీన్ని నిర్మించింది. ఆ ఎయిర్‌పోర్టులో ఇది ఆరో టెర్మినల్. సముద్ర మట్టానికి 2950 మీటర్ల ఎత్తులో 10,300 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ ఎయిర్ పోర్టు 2006లో ప్రారంభమైంది.
2016 నాటికి ఈ ఎయిర్ పోర్టు సుమారు నాలుగు లక్షల ప్రయాణికులకు సేవలందించింది. 2020 నాటికి ఏడున్నర లక్షల ప్రయాణికులతో పాటు మూడు వేల టన్నుల సామాగ్రిని రవాణా చేసేలా చైనా దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల నుంచి టిబెట్‌కు విమాన సర్వీసులు నడుపుతోంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలను మోహరించేలా దీన్ని తీర్చిదిద్దింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com