సైబర్‌ సెక్యూరిటీ థ్రెట్స్‌పై అప్రమత్తం

- March 06, 2017 , by Maagulf
సైబర్‌ సెక్యూరిటీ థ్రెట్స్‌పై అప్రమత్తం

మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంఓటిసి) సైబర్‌ సెక్యూరిటీ క్యు-సెర్ట్‌ అండర్‌ సెక్రెటరీ జనరల్‌ ఖాలిద్‌ అల్‌ హాషిమి మాట్లాడుతూ, సైబర్‌ సెక్యూరిటీ థ్రెట్స్‌పై స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఐదు రోజులపాటు సాగే రీజినల్‌ సైబర్‌ డ్రిల్‌ (అలర్ట్‌) - ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్‌, ఈజిప్ట్‌, ట్యునీషియా తదితర దేశాలతో కలిసి సైబర్‌ సెక్యూరిటీపై ఖతార్‌ పనిచేస్తోందని ఆయన అన్నారు. జాతీయ సరిహద్దులతో సమానంగా సైబర్‌ సెక్యూరిటీ అనేది ప్రభుత్వాలకి, వ్యక్తులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు హాషిమి. ఐటియు ఎఆర్‌సిసి డహెడ్‌ బదర్‌ అల్‌ సలేహి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్‌ దాడులు, మరింత భద్రత గల సైబర్‌ వ్యవస్థ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని చెప్పారు. కంపూటర్లతో అనుసంధానమై ఉన్నవారి సంఖ్య 2015 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12 ట్రిలియన్లకు చేరుకుందని ఐటియు అరబ్‌ రీజియన్‌ డైరెక్టర్‌ ఇబ్రహీమ్‌ అల్‌ హద్దాద్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com