భారతీయులకు భరోసా ఇచ్చిన అమెరికా గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్
- March 06, 2017
భారతీయులు తమకు ఎంతో ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. ఇటీవల కాన్సాస్ బార్ తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్లపై కాల్పుల ఘటనపై.. కాన్సాస్ గవర్నర్ భారత దౌత్యాధికారులు, స్థానిక ఎన్నారై కమ్యూనిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులకు ఆయన భరోసా ఇచ్చారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఉపాధి కోసం కాన్సాస్ వస్తుంటారని... కానీ భారతీయులు మాత్రం తమకు చాలా ముఖ్యమైన వారని గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. మొన్నటి ఘటనకు తాను సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారతీయులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న సిద్ధమంగా ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం