120 కిలోల బరువు తగ్గిన ప్రపంచ భారీకాయురాలు
- March 06, 2017
ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలైన ఈజిప్టు మహిళ ఈమన్ అహ్మద్ నెలరోజుల కాలంలో 120 కిలోల బరువు తగ్గారని ఆమెకు చికిత్స చేస్తున్న సైఫీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. జన్యు పరీక్షల నివేదిక రాగానే ఈమెకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన భారీకాయురాలైన ఈమన్ అహ్మద్ ను 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించి చికిత్స చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.
భారీకాయం వల్ల ఈమన్ అహ్మద్ కు ఎమ్మారై పరీక్ష చేసేందుకు వీలుకాకపోవడం వల్ల పోర్టబుల్ ఎక్స్ రేలు తీస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగి బరువును పరిశీలించేందుకు వీలుగా ఆమె పడుకున్న మంచానికే తూకపు యంత్రాన్ని బిగించారు.నిరంతరం ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆమె సులవుగా ఆహారం తీసుకోవడంతోపాటు మాట స్పష్టంగా వస్తుందని డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. మందుల వల్ల శరీరంలో ఉన్న ద్రవపదార్థాల శాతం తగ్గి మరో వందకిలోల బరువు తగ్గుతుందని డాక్టర్ లక్డావాలా వివరించారు. ఈమె చికిత్సకు దాతలు రూ.60 లక్షల రూపాయల దాకా విరాళం అందిందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







