ఈ నెల 17 న 'మా అబ్బాయి'
- March 07, 2017
'ప్రేమ ఇష్క్ కాదల్', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ - "అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు ఇమేజ్ ని మరింత పెంచే సినిమా అవుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమా లో పుష్కలంగా ఉన్నాయి. మా వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాతో ఇండస్ట్రీలో నిలబడిపోతుందనే గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు కుమార్ వట్టి కొత్తవాడైనా , అనుభవజ్ఞుడిలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. " అని చెప్పారు.
దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ - "ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్ ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది " అని తెలిపారు.
శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః థమశ్యామ్,సంగీతంః సురేష్ బొబ్బిలి, పాటలుః కందికొండ, కరుణాకర్ అడిగర్ల, సురేష్ బనిశెట్టి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః వండాన రామకృష్ణ, నిర్మాతః బలగ ప్రకాష్ రావు,కథ,స్ర్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వంః కుమార్ వట్టి.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







