నాగార్జున ట్వీట్‌ 'బ్యాక్‌ టు బిజినెస్‌' అంటూ

- March 07, 2017 , by Maagulf
నాగార్జున ట్వీట్‌ 'బ్యాక్‌ టు బిజినెస్‌' అంటూ

అక్కినేని నాగార్జున ఈ రెండు వారాలుగా ఎంతో ఒత్తిడిని అనుభవించాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ఓం నమో వేంకటేశాయ' అతి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక, చిన్న కొడుకు అఖిల్‌ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్‌ను బాగా డిస్ట్రబ్‌ చేసిందనే విషయం తెలిసిందే. 
ఈ నేపథ్యంలో మీడియాకు, సన్నిహితులకు దూరంగా గడిపిన నాగ్‌.. ఇప్పుడిప్పుడే తన పనులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'రాజుగారి గది-2' షూటింగ్‌కు హాజరవుతున్నాడు. ఆ షూటింగ్‌ స్పాట్‌లో తీసిన ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన నాగ్‌..
'బ్యాక్‌ ఇన్‌ బిజినెస్‌ విత్‌ రాజుగారి గది' అని కామెంట్‌ రాశాడు. ఆ ఫోటోలో నాగ్‌ ఎంతో హ్యాండ్సమ్‌ లుక్‌తో ఉన్నాడు. అయితే అఖిల్‌ బ్రేకప్‌ గురించి మాత్రం స్పందించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com