2016లో 670 మంది బెగ్గర్స్ అరెస్ట్
- March 07, 2017
2015తో పోల్చితే, 2016లో ఇంకా ఉధృతంగా బెగ్గర్స్‌ని నిరోధించేందుకు చర్యలు చేపట్టామనీ ఈ క్రమంలో 670 మందిని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఓ నివేదికలో పేర్కొంది. 2015లో ఈ సంఖ్య 612గా ఉంది. మొత్తం 2338 తనిఖీల్ని నిర్వహించగా, అందులో మస్కట్లోనే 1,380 తనిఖీలను నిర్వహఙంచడం జరిగింది. నార్త్ అండ్ సౌత్ బతినాలో 120, బురైమి, దోఫార్లలో 50 చొప్పున తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 670 మంది పట్టుబడ్డారు. మస్కట్‌లో అత్యధికంగా 482 మంది అరెస్ట్‌లు జరిగాయి. రమదాన్ సందర్భంగా సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోడానికి బెగ్గర్స్ ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని అధికారులు తెలిపారు. పార్కింగ్ ఏరియాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బెగ్గర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటోందని వారు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బెగ్గర్స్ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. పదే పదే బెగ్గింగ్ చేస్తూ పట్టుబడేవారికి జైలు శిక్ష తప్పనిసరి.
తాజా వార్తలు
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్