కొలంబో రెస్టారెంట్ లో ఎలుక మాంస వంటకాలు..ఆకస్మిక దాడి మూసివేత
- March 07, 2017
అల్ రేయాన్:ఎలుకలను చిన్ని చిన్ని మాంసం ముక్కలుగా కొట్టి..కొలంబో రెస్టారెంట్ లో రహస్యంగా వండి వడ్డిస్తుంటే చవగ్గా మాంసాహారం లభిస్తుందని పలువురు నాన్ వెజ్ ప్రియులు లొట్టలు వేసుకొంటూ తిన్నారు ...వీకెండ్ పార్టీలు స్నేహితులతో కల్సి చేసుకొన్నారు. తీరా తాము తిన్నది ఎలుకుల వేపుడు..మూషికాల బిర్యాని అని తెల్సుకొని ఇపుడు వారంతా తెగ బాధపడిపోతున్నారు. స్థానిక మీసైమీర్ లో ఉన్న ప్రముఖ కొలంబో రెస్టారెంట్ అనారోగ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తుందనే సమాచారంతో అల్ రేయాన్ మున్సిపాలిటీ ఆకస్మిక దాడి చేసి రెండు నెలల పాటు మూసివేశారు. ఇందుకు సంబంధించిన మూసివేత వివరాలు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (బాలదియ ) స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా నవీకరించబడింది. ఈ నిర్ణయం దాదాపు ఒక వారం క్రితం తీసుకోవడం జరిగింది. చిన్న జంతువుల మాంసాన్ని ఆహారంలో కలిపినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఫోటోలు ప్రదర్శించారు. నిజానికి, ప్రజల అంచనాల ప్రకారం చిత్రంలో చూసిన ఫోటోలలో చిన్న ప్రాణులు "ఎలుక" అని గుర్తించారు. మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సకాలంలో బలమైన చర్య తీసుకోవడంపై కతర్ అంతటా నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు