ఈయూలో 'శరణార్థులకు వీసాలను నిరాకరించవచ్చు'
- March 07, 2017
ఆశ్రయం కోరేందుకు ప్రయత్నించేవారికి స్వల్పకాలిక మానవతావాద వీసాలను నిరాకరించే అధికారం ప్రభుత్వాలకు ఉందని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. బెల్జియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ సిరియన్ కుటుంబం దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. సిరియా అంతర్యుద్ధం నేపథ్యంలో గత రెండేళ్ళ నుంచి ఈయూ దేశాలకు వలసలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ కుటుంబ సభ్యులు గత అక్టోబరులో లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న బెల్జియన్ ఎంబసీలో హ్యుమనిటేరియన్ వీసాల కోసం దరఖాస్తు చేశారు. వీరు
నిర్బంధంలో ఉన్న అలెప్పో నగరానికి చెందినవారు. ఈ కేసును విచారించిన కోర్టు సంచలన తీర్పునివ్వడంతో బెల్జియం ఇమిగ్రేషన్ మంత్రి థియో ఫ్రాంకెన్ హర్షం వ్యక్తం చేశారు.
''మేం గెలిచాం'' అని ట్వీట్ చేశారు. ప్రతికూల తీర్పు వచ్చి ఉంటే నియంత్రణలేని వలసలకు తలుపులు బార్లా తెరచినట్లేనని పేర్కొన్నారు. ''ఈయూ చట్టం ప్రకారం ఆశ్రయం కోసం దరఖాస్తు చేయడానికి తమ దేశంలో ప్రవేశించాలనుకొనేవారికి మానవతావాద వీసాలను ఈయూ సభ్య దేశాలు మంజూరు చేయవలసిన అవసరం లేదు. తమ జాతీయ చట్టాల ఆధారంగా ఆ విధంగా చేసే స్వేచ్ఛ వాటికి ఉంది'' అని కోర్టు తీర్పు పేర్కొంది.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!