మహిళలకు వొడాఫోన్ బంపర్ ఆఫర్

- March 07, 2017 , by Maagulf
మహిళలకు వొడాఫోన్ బంపర్ ఆఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వోడాఫోన్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా 2 జీబీ డేటాను అందిస్తామని ప్రకటించింది వోడాఫోన్.

వోడాఫోన్ రెండ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద మహిళా చందాదారులకు ఉచితంగా 2 జీబీ డేటాను అందించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలోని వోడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ చందాదారులకేనని వోడాఫోన్ ప్రకటించింది.
మార్చి 8వ, తేది మాత్రమే ఈ ఆఫర్ పరిమితం కానుంది. చందాదారులకు ఉచితంగా 2 జీబీ ఉచిత డేటా ఆటోమెటిక్ వస్తోందని వోడాఫోన్ ప్రకటించింది.
ఈ విషయాన్ని మహిళలకు టెస్ మేసేజ్ ద్వారా తెలుపనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.
ఒకవేళ టెస్ట్ మేసేజ్ ద్వారా ఈ ఉచిత గిఫ్ట్ ను అందుకోలేని వారు దగ్గర్లోని వోడాపోన్ స్టోర్ ను సంప్రదించాల్సిందిగా ఆ కంపెనీ కోరింది.
వర్క్ ప్లేస్ లో మహిళలకు తమ సంస్థ సమాన అవకాశాలు కల్పిస్తోందని తాము నమ్ముతున్నట్టుగా వొడాఫోన్ ఇండియా డిల్లీ ఎన్ సి ఆర్ బిజినెస్ హెచ్ అలోక్ వర్మ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com