తెలుగు డైరెక్టర్‌పై అత్త దాడి
- March 08, 2017
'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలకు దర్శకత్వం వహించిన కొండా విజయ్ కుమార్ పై అతని అత్త చెప్పుతో దాడిచేసింది. తన కూతురికి మాయమాటలు చెప్పి విజయ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడని అత్త ఆరోపించింది. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన ప్రసూన అనే యువతిని విజయ్ కుమార్ ఈ నెల 1న శ్రీనగర్ కాలనీలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. దీనిపై ప్రసూన తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. తన కూతురుకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని విజయ్ కుమార్ మాయమాటలు చెప్పాడని, అయితే అతను గతంలోనే వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, కొత్త దంపతుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి పోలీసులు విచారించారు.
తామిద్దరం మేజర్లమని ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయలేమన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రసూన తల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే దాడికి ప్రయత్నించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







