"నేనోరకం" ఆడియో విడుదల..
- March 08, 2017
రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమా లొని సాంగ్స్ ను పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ఒక్కొ పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలిపారు. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ యుట్యూబ్ ఛానెల్ లో నేనోరకం జూక్ బాక్స్ అప్లొడ్ చేయగా, సినిమా మార్చి 17న విడుదలకు సిద్దమవుతోంది. ఈసందర్బంగా ..
గోపిచంద్ మాట్లాడుతూ.. నేనోరకం ట్రైలర్ సూబర్బ్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఈ ఇయర్ లో ఓ మంచి సినిమా గా "నేనోరకం" నిలుస్తుందని ఆశిస్తున్నానన్నారు.
పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. నేనోరకం సినిమా నేను చూశాను. సినిమా కధనం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. రామ్ శంకర్ కు హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం వచ్చింది. పాటలన్ని సందర్బానుసారంగా బాగున్నాయన్నారు..
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేనోరకం టైటిల్ కు తగ్గట్టుగానే పాటలు, ట్రైలర్ ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమా సక్సెస్ పై టీమ్ కాన్ఫెడెంట్ గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అన్నారు..
రామ్ శంకర్ మాట్లాడుతూ.. థ్రిలింగ్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబడిన చిత్రం నేనోరకం. సమకాలీన అంశాల స్పూర్తితో పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.
దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ... మహిత్ పాటలు, రీరికార్డింగ్ నేనోరకం సినిమాకు ఓ ఎసెట్. కంటెంట్ ఈ చిత్రానికి ప్రధాన బలం. టెక్నికల్ గా కూడా ది బెస్ట్ మూవీ ఇది. శరత్ కుమార్ కేవలం కధ నచ్చి ఈ సినిమాను చేశారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్ ను "నేనోరకం" అందిస్తుందన్నారు.
నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... హీరో రామ్ శంకర్ కెరీర్ లో నేనోరకం దిబెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆడియెన్స్ తో పాటు, క్రిటిక్స్ ను కూడా అలరించెలా చిత్రముంటుంది.మార్చి 17న సినిమాను విడుదల చేస్తున్నామన్నారు.
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







