'కాటమరాయుడు' మ్యూజికల్ హిట్--అనూప్ రూబెన్స్
- March 08, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించబోతున్నారు. దీంతో.. 'కాటమరాయుడు' మాంచి మాస్ మసాల చిత్రమని ప్రచారం జరుగుతోంది. అయితే, రాయుడుకి మ్యూజికల్ టేస్ట్ ఉందట. కాటమరాయుడు మ్యూజికల్ హిట్ అంటున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.
ఈ చిత్రంలో ఆరు పాటలు ఉండనున్నాయి. అన్నీ సూపర్భ్ గా ఉంటాయి. కాటమరాయుడు మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు సంగీత దర్శకుడు అనూప్. అంతేకాదు.. సప్రైజ్ ప్యాకేజ్ కూడా ఉందట. సినిమా రిలీజైన కొద్దిరోజులకి కొన్ని బిట్స్ సాంగ్స్ ని యాడ్ చేయబోతున్నారట.
ఆ బిట్ సాంగ్స్ పవన్ టేస్ట్ తగినట్టుగా ఉంటాయని చెబుతున్నారు.
పవర్ సినిమాకి సంగీతం అందించడం అనూప్ కిది రెండోసారి. గతంలో వెంకీ, పవన్ ల 'గోపాల గోపాల' సినిమాని సంగీతాన్ని సమకూర్చాడు అనూప్. ఆ సినిమాలో అనూప్ వర్క్ నచ్చే పవన్ తన మరో సినిమాకి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాటమరాయుడు కోసం తీసుకొన్నాడు. ఇప్పుడా నమ్మకాన్ని నెలబెట్టుకోబోతున్నానని నమ్మకంగా చెబుతున్నాడు అనూప్.
ఇక, ఇటీవలే రిలీజైన కాటమరాయుడు టైటిల్ సాంగ్ 'మిరా మిరా మీసం.. ' అదిరిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఒకదాని తర్వాత మరోటి క్యూ కట్టనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 18న కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని అదిరిపోయే రేంజ్ లో నిర్వహించబోతున్నారు. కాటమరాయుడు ఉగాధి కానుకగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!