పూర్తి కావస్తున్న నజ్మా స్ట్రీట్ విస్తరణ
- September 23, 2015
దోహాలోని ఇ-రింగ్ మరియు ఎఫ్-రింగ్ రోడ్ల మధ్యనున్న నజ్మా స్ట్రీట్ విస్తరణ దాఆపుగా పూర్తి కావచ్చింది. విస్తరణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు, అవసరమైనంత టెక్నికల్ ఎక్విప్‌మెంట్ విస్తరణ పనుల్ని పూర్తి చేయడానికి వినియోగించబడుతోంది. అనుకున్న సమయానికే విస్తరణ పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈద్ సెలవులు పూర్తయ్యే సమయానికి విస్తరణ పూర్తి కావచ్చు. విస్తరణ పనులు జరుగుతున్నందున వాహనదారులు సహకరించాలని, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నా, కొన్ని రోజుల్లో ఆ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు చెప్పారు. రోడ్డు సామర్ధ్యం పెంచేందుకు, వాహనదారులకు సౌకర్యవంతంగా మలచేందుకు రోడ్డు విస్తరణను ప్రారంభించారు. ల్యాండ్‌స్కేపింగ్, స్ట్రీట్ లైటింగ్, ఫుట్‌పాత్స్, సైకిల్ పాత్స్ వంటి సౌకర్యాలతో కొత్త రోడ్డును తీర్చిదిద్దారు. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఈ రోడ్ విస్తరణలో పొందుపర్చడం జరుగుతోంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







