ఈద్ రద్దీని అధిగమించేందుకు ట్రాఫిక్ ప్రణాళికలు
- September 23, 2015
బహ్రెయిన్‌లో ఈద్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా రోడ్లపై పెరిగే రాహన రద్దీని నియంత్రించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖకు సంబంధించి ట్రాఫిక్, గస్తీ డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్ షేక్ నాసర్ బిన్ అబ్దుల్‌రహమ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, తగిన ఏర్పాట్లు చేశామనీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామనీ అన్నారు. గతంతో పోల్చితే ఈసారి ఈద్ ప్రార్థనల కోసం భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా 90 వేల మంది నిత్యం ప్రయాణిస్తుంటారనీ, అయితే ఈద్ సందర్భంగా 5 లక్షల 84 వేల 353 మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. మసీదుల చుట్టూ పోలీస్ పెట్రోలింగ్ అధికంగా నియమించడం జరిగిందనీ, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకున్నామనీ, పౌరులు కూడా ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని షేక్ నాజర్ విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా తమ వాహనాల్ని నడపాలనీ, పాదచారులు తగిన ప్రదేశాల్లో మాత్రమే రోడ్లను దాటవలసి ఉంటుందని సూచిస్తున్నారు. అనుకోని సంఘటనలు జరిగినట్లయితే 199కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రద్దీ కారణంగా, విమాన ప్రయాణీకులు షెడ్యూల్ కంటే ముందుగా విమానాశ్రయానికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని బహరెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కోరుతున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







