శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- September 23, 2015
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక జంటను కస్టమ్స్ అధికారులు అతనిని తనిఖీ చేశారు. వారి వద్ద ఆభరణాల రూపంలో బంగారం ఉండటంతో పాటు బంగారం బిస్కట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆభరణాలను బిస్కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసు లకు అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఒక కిలో 76 గ్రాములు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. కాగా ఈ విధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడం పరి పాటిగా మారింది. దీంతో స్మగ్లింగ్‌పై పూర్తి నియంత్రణ తెచ్చేందుకు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే దక్షణ భారత దేశంలో స్మగ్లింగ్‌కు అనుకూలమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాదు ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంది. అక్కడి అధికారుల చేతకానితనమా లేక స్మగ్లర్లకు అక్కడ అధికారుల నుంచి సహకారం అందుతుందా, అదీ కాక సాంకేతిక సమస్యలా అన్న దానిపై స్పష్టత లేనప్పటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా జరిగి స్మగ్లింగ్‌లో కేవలం 10 శాతం మాత్రం పట్టుబడుతుందని 90 శాతం యదేశ్చగా మార్కెట్‌కు తరలుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అక్కడి అధికారులు బంగారం స్మగ్లింగ్‌కు అరికట్టడంలో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







