నిబంధనలు ఉల్లంఘిస్తే 200,000 జరీమానా తప్పదు
- March 08, 2017
ఏప్రిల్ నాటికి సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించని పక్షంలో 200,000 దిర్హామ్ల వరకు జరీమానా చెల్లించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. అబుదాబీ మునిసిపాలిటీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్లో ముఖ్యంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయనీ, అక్కడ సరైన అకామడేషన్ కల్పించాలని, భద్రతా ప్రమాణాల్ని నిబంధనలకు అనుగుణంగా మార్చవలసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 6 వరకు పలు సంస్థలకు డెడ్లైన్ విధించారు. ఈలోగా సౌకర్యాలను మెరుగపర్చాలి. లేనిపక్షంలో భారీ జరీమానాలు తప్పవు. ఎప్పటికప్పుడు చేస్తున్న తనిఖీలతో కార్మికుల భద్రతపైనా, వారు పనిచేసే ప్రాంతంలో శుభ్రతపైనా ఉల్లంఘనల్ని గుర్తించి జరీమానాలు విధిస్తున్నామనీ, హెచ్చరికలు జారీ చేస్తున్నామనీ అయినప్పటికీ కొన్ని సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఇకనుంచి జరీమానాలు భారీ స్థాయిలో విధించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్