దయీష్ మద్దతుదారుడి కాల్చివేత
- March 08, 2017
పోలీసు అధికారులు, రియాద్లో దయీష్ మద్దతుదారుడ్ని కాల్చి చంపారు. అల్ రయ్యాన్ డస్ట్రిక్ట్లోని ఓ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో పనిచేస్తున్న కార్మికుడు, తమ సహచరుడొకరు దయీష్ మద్దతుదారుడిగా ప్రకటించుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు, పోలీసులపైకి పిస్తోల్ ఎక్కుపెట్టాడు. ఈ క్రమంలో అతన్ని కాల్చి చంపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మరో వ్యక్తి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం రెండు పిస్తోల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!