చిరు బోయపాటి తోనే కన్ఫామ్ చేసిన 152 సినిమా

- March 09, 2017 , by Maagulf
చిరు బోయపాటి తోనే కన్ఫామ్ చేసిన 152 సినిమా

మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు.. వరస సినిమాలపై దృష్టి పెట్టిన చిరంజీవి తన 151 సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.. ఈ సినిమాను కూడా కొణిదెల బ్యానరపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 151 వ సినిమా స్వతంత్ర్య సమర యోధుడైన ఉయ్యలవాడ నరసింహా రెడ్డి చరిత్రను సినిమాగా తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాకు సమబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపై ప్రస్తుతం దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. మార్చి 27 న పూజాకార్యక్రమం జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నుంచి జరుపుకొనేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.. కాగా చిరంజీవి తన 152 వ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు.. తాజాగా తన 152 సినిమా బోయపాటి శ్రీనుతో చేయనున్నట్లు చిరు ప్రకటించాడు.. బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక చిరంజీవి సినిమా స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com