2017 చివరినాటికి దోహా రోడ్లపై స్మార్ట్ బస్సులు
- March 09, 2017
మోవాసాలత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, తన 'స్మార్ట్ బస్సులు' కీట్ కం 2017 చివరినాటికి దోహా రోడ్లపై పరుగులు పెట్టించనున్నారు. ఆయా బస్సులలో ఎక్కువ భద్రత మరియు సౌకర్యం వంటి లక్షణాలతో ప్రయాణికులను ఆకట్టుకొంటాయి. అధికారికంగా 'స్మార్ట్ బస్సులు' గా పరిచయం కాబడుతున్న ఈ బస్సులను దోహా రహదారులపై ప్రయాణించాలంటే తొలుత ఆ కంపెనీ అధికారుల నుంచి ఆమోదం పొందాల్సి ఉంది మోవాసాలత్ అధికారులు ఈ బస్సులను పరిశీలించారు. ఈ బస్సులు ఆమోదం కనుక పొందితే ఉంటే, 2017 చివరలో దోహా రోడ్ల పై తిరిగి ప్రజలను పెద్ద ఎత్తున తప్పక ఆకర్షిస్తాయని మోవాసాలత్ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ శాఖ అధికారి తెలిపారు. ఈ కొత్త బస్సులలో ప్రయాణాలు ఎంతో సౌకర్యవంతమైన రీతిలో ఉండటానికి రూపొందించబడ్డాయి తాజా సాంకేతిక మరియు అదే సమయంలో సురక్షితమైన భద్రతా ప్రమాణాలతో రూపొందించబడ్డాయి. ఈ బస్సులు నడుస్తున్నప్పుడు లోపల ఏర్పాటు చేసిన విస్తృత డిజిటల్ తెరలలో ప్రయాణికుల సౌకర్యార్థం రాబోయే విరామాలలో చూపిస్తాయి. అన్ని 'స్మార్ట్ బస్సుల' లో ఒక నిర్దిష్ట గమ్యానికి దూరం మరియు అంచనా వేయబడి ఆ ప్రదేశానికి చేరుకొనే సమయం సైతం ప్రయాణికులకు డిజిటల్ తెరలపై చూపిస్తుంది. అలాగే రోడ్ల పరిస్థుతుల గురించి ముందుకు వెళ్లడం ఎలా సాధ్యం అవుతుందో తెలియచేస్తుంది అలాగే ట్రాఫిక్ జామ్‌లు మొదలైన సమాచారం డ్రైవర్ కు తెలియజేస్తుంది ప్రతి 'స్మార్ట్-బస్' లలో ఒక నిఘా కెమెరా ఉంటుంది. ఆ సమయంలో బస్సులు నియంత్రించడమే కాక సమర్ధవంతంగా నిర్వహించబడుతుంది. ఈ విధానంతో ప్రయాణికుడు ఒక వెళ అవసరమైతే నేరుగా మోవాసాలత్ ప్రధాన కార్యాలయం వద్ద కస్టమర్ కేర్ ని సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్‌లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!







