సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్‌ వర్కర్‌

- March 09, 2017 , by Maagulf
సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్‌ వర్కర్‌

ఓ వ్యక్తి తన సహచరుడ్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హతుడు, హంతకుడు ఇద్దరూ పాకిస్తాన్‌కి చెందినవారే. హంతకుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మిడ్‌ డే బ్రేక్‌ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఇద్దరి మధ్యా ఓ విషయమై తగాదా చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2016, జులై 26న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తన కాలిని, ఇంకో వ్యక్తి మొహమ్మీద పెట్టగా, ఆ కాలి నుంచి వచ్చిన దుర్వాసనకి ఆ వ్యక్తి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయి, గొడవకు దిగాడని వారిద్దరూ పనిచేస్తున్న సంస్థ సూపర్‌వైజర్‌ చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడ్ని అంబులెన్స్‌లో తరలించామని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన వివరించారు. తన కుటుంబాన్ని దూషించడం వల్లనే తాను ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com