రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి

- March 10, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి

భారతీయ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అబుదాబీలో జరిగింది. మృతురాలి పేరు స్మృతి జేమ్స్‌. అల్‌ వహ్దా బస్‌ స్టేషన్‌ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఆమెను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని త్రిశూర్‌ జిల్లాకి చెందినవారు. మృతురాలు తన తల్లిదండ్రులు జేమ్స్‌ మరియు శైలజలతో ఉంటున్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com