గల్ఫ్ ఫిలిం అవార్డ్స్‌లో మలయాళ సినీ ప్రముఖులు
- March 10, 2017
శుక్రవారం సాయంత్రం జరగనున్న గల్ఫ్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. మోహన్‌లాల్, జయరామ్, మంజు వారియర్ సహా పలువురు ప్రముఖులు, ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అబుదాబీలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో గల్ఫ్ ఫలిం అవార్డ్స్ 2016 ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఉన్ని మీనన్, నడిర్ షా, సమాద్, అఫ్సల్ తదితర సింగర్స్ తమ పాటలతో హోరెత్తించనున్నారు. షమ్నా కాసిమ్, ఇనియా డాన్స్ పెర్ఫామెన్స్లు, ఆర్య, ఎడవెల బాబు, రమేష్ పిషారాది, ధర్మజన్ బోల్గాటి, నవోదయ సాజు తదితరులు కామెడీ స్కిట్స్‌తో ఆహూతుల్ని అలరించనున్నారు. 30 నుంచి 150 దిర్హామ్‌ల ప్రైస్‌తో టిక్కెట్లు లభ్యం కానున్నాయి. 150, 500 దిర్హామ్‌ల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







