ఎంప్లాయ్మెంట్ వీసా కోసం ఫోర్జరీ
- March 11, 2017
ఎంప్లాయ్మెంట్ వీసా కోసం ఆస్ట్రేలియన్ ఎంబసీకి ఫోర్జరీ సర్టిఫికెట్‌ని పంపించాడో ప్రబుద్ధుడు. దుబాయ్‌కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. 38 ఏళ్ళ ఈజిప్టియన్ ఇంజనీర్, ఈ నేరానికి పాల్పడ్డాడు. నఖీల్ జారీ చేసిన పత్రంగా ఓ నకిలీ పత్రాన్ని అతను సృష్టించడం జరిగింది. ఇ-మెయిల్ ద్వారా దాన్ని ఆస్ట్రేలియా ఎంబసీకి పంపించి, వీసా కోసం అప్లయ్ చేశాడు. గత ఏడాది జూన్ 8 న ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఎంబసీ నుంచి అందిన సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు విచారణ పూర్తి చేసి, న్యాయస్థానం ముందు నిందితుడ్ని నిలబెట్టారు. మార్చ్ 21న ఈ కేసు విచారణకు రానుంది.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







