సౌదీ కార్మిక మంత్రితో ద్వైపాక్షిక సహకారం గూర్చి చర్చించిన భారత రాయబారి
- March 11, 2017
రియాడ్: భారత రాయబారి అహ్మద్ జావెద్ కార్మిక మరియు సామాజిక అభివృద్ధి రంగాల్లో పరస్పర ఆసక్తి సమస్యలపై సౌదీ కార్మిక మంత్రితో చర్చించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకునేందుకు ఒకరి ఆలోచనలను మరొకరు మార్పిడి చేసుకొనేందుకు సౌదే కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి ఆలీ బిన్ నాసర్ అల్ ఘూఫీస్ తో సమావేశమయ్యారు. ."నూతన కార్మిక మంత్రితో భారత రాయబారి ఈ విధంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా సంతకం చేసిన సాధారణ వర్గం కార్మికులపై ఒప్పందం, ప్రారంభ ఆమోదం కోసం సౌదీ కార్మిక మంత్రి సాయం కోరారు. అనిల్ నౌటియాల్ , మొదటి కార్యదర్శి (కమ్యూనిటీ సంక్షేమం) భారత ఎంబసీ వద్ద, జరిగిన సమావేశ విషయాలను స్థానిక విలేకరులకు తెలిపారు. సాధారణ వర్గ ఒప్పంద కార్మికుల నియామకానికి సౌదీ వైపు పనికి సంబంధించిన కార్మిక సహకారం ఉంటుందని నౌటియాల్ తెలిపారు. స్వదేశానికి పంపబడ్డ సౌదీ ఓగెరు సాద్ గ్రూప్ మరియు సౌదీ బుష్ గ్రూప్, నుండి బకాయి పడిన న్యాయపరమైన వేతనాలు చెల్లించాలని ఉపాధి కోల్పోయిన కార్మికుల ప్రయోజనాలు సత్వర పరిష్కారం చూపాలని కార్మిక మంత్రిని భారత రాయబారి అభ్యర్ధించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







