ఎన్నారై షాప్‌కి నిప్పు యూఎస్‌లో దారుణం..

- March 13, 2017 , by Maagulf
ఎన్నారై షాప్‌కి నిప్పు యూఎస్‌లో దారుణం..

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. కూఛిబొట్ల, పటేల్‌ ఘటనలు మరవకముందే తాజాగా ఫ్లోరిడా రాష్ర్టంలోని భారతీయ సంతతికి చెందిన 
స్టోర్‌కి నిప్పుపెట్టాడు అగంతకుడు. నిందితుడు 64 ఏళ్ల వృద్ధుడు రిచర్డ్‌ లాయిడ్ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఎన్నారై షాప్‌కి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లింలు ఉండకూడదనేది తన కోరికని, అందుకే తగల బెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు.
ఆ షాప్‌లో జ్యూస్ కొనుగోలు చేసేందుకు కొద్దిరోజుల కిందట వెళ్లానని, అక్కడ లేదని చెప్పడంతో వెనుదిరిగానని అన్నాడు నిందితుడు.
అందులో ముస్లిం ఉద్యోగి ఉండటం తనను నిరాశపరిచిందని, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇస్లాం చర్యల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు వివరించాడు.
స్టోర్ మూసి ఉన్నప్పుడు దాని ముందు చెత్త డబ్బాను కుమ్మరించి, లాయిడ్‌ నిప్పు అంటించాడు. ఫైర్ విభాగం త్వరగా స్పందించడంతో ఆస్తి నష్టం తప్పింది. ఆ స్టోర్‌ భారత సంతతి వ్యక్తిదని తనకు తెలియదని, అరబ్‌ ముస్లింలది అనుకున్నానని విచారణలో నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com