అతి వేగమే ప్రమాదాలకు కారణం

- March 13, 2017 , by Maagulf
అతి వేగమే ప్రమాదాలకు కారణం

మస్కట్‌: 55 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 2015తో పోల్చితే 2016లో రోడ్డు ప్రమాదాలు 32.8 శాతం తగ్గినట్లు తేలింది. వీటిల్లో కూడా 55 శాతం ప్రమాదాలు అతి వేగం కారణంగానే జరిగాయి. స్పీడ్‌ లిమిట్‌ని పాటించని వాహనాల వల్ల 63 శాతం మంది గాయాల పాలయ్యారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) వివరాల & రపకారం 2016లో మొత్తం 3261 ప్రమాదాలు చోటు చేసుకోగా, 692 మంది మృతి చెందారు. అతి వేగం కారణంగా 2499 ప్రమాదాలు జరిగాయి. 2052 మంది గాయాల పాలవగా, 378 మరణాలు అతి వేగతంతోనే జరిగినట్లు లెక్కలు తేల్చాయి. నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్‌ కారణంగా 15 శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. రిస్కీ ఓవర్‌టేకింగ్‌ 10 శాతం మరణాలకు కారణం. 'యువర్‌ లైఫ్‌ ఈజ్‌ ఎ ట్రస్ట్‌' పేరుతో రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఓ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచగలమని అధికారులు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com