సరదాగా నడిచిపోయే సినిమా 'రోగ్‌'

- March 13, 2017 , by Maagulf
సరదాగా నడిచిపోయే సినిమా 'రోగ్‌'

‘రోగ్‌’ మరో చంటిగాడి ప్రేమ కథ. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాటల వేడుక సోమవారం రాత్రి జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్‌, క్రిష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత తీసిన సరదాగా నడిచిపోయే సినిమా రోగ్‌ అని చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. హీరో ఇషాన్‌ బాగా నటిచాడన్నారు. మరో 50 సినిమాల్లో నటిస్తాడని, 20 ఏళ్ల వరకు కష్టపడే సత్తా అతడికి ఉందన్నారు. సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మంచి సంగీత బాణీలు అందించారన్నారు. గేయ రచయిత భాస్కరబట్ల అద్భుతంగా పాటలు రాశారన్నారు. ఆడియో మంచి హిట్‌ అవుతుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయికలు మన్నారా చోప్రా, ఏంజిలా సినిమాలో అందంగా కనిపించారన్నారు.
కథానాయకుడు ఇషాన్‌ మాట్లాడుతూ తన కుటుంబం వల్లే ఈ సినిమాలో నటించగలిగానని పేర్కొన్నాడు. నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్‌ గురువు రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నాడు. సీఆర్‌ మనోహర్‌, సీఆర్‌ గోపీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com