నటి కీర్తీసురేశ్‌ను వరించిన సౌత్‌ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డు

- March 13, 2017 , by Maagulf
నటి కీర్తీసురేశ్‌ను వరించిన సౌత్‌ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డు

పెరంబూర్‌; సౌత్‌ ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డు నటి కీర్తీసురేశ్‌ను వరించింది. ది రిట్జ్‌ స్టైల్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రామాపురంలోని ఒక నక్షత్ర హోటల్‌లో ఆడంబరంగా జరిగింది. దక్షిణాదికి చెందిన సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ అవార్డుల కార్యక్రమాన్ని రిట్జ్‌ పత్రిక సంస్థ నిర్వాహకురాలు అరుణ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసిన ఈ అవార్డుల వేదికపై యువ నటి కీర్తీసురేశ్‌ సౌత్‌ ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కళాశాల రోజుల నుంచి రిట్జ్‌ పత్రికను చదువుతున్నానన్నారు.
అలాంటిది ఆ పత్రిక పేరుతో అందిస్తున్న ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు శివకార్తీకేయన్‌ మాట్లాడుతూ అవార్డులు కళాకారులకు ప్రోత్సాహకంగా ఉంటాయన్నారు. అలాగని వాటిని తలకెక్కించుకోరాదని పేర్కొన్నారు. నటి క్యాథరిన్‌ ట్రెసా, సంగీతదర్శకుడు అనిరుద్, నటి, మిస్‌ ఇండియా శోభిత ధూళిపాళ, క్రికెట్‌ క్రీడాకారుడు అమిత్‌ మిశ్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ముందుగా అందాల బామలు క్యాట్‌వాక్‌ ఆహుతులను అలరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com