హ్యూమన్ ట్రాఫికింగ్: ఐదుగురు మహిళలకు జైలు
- March 14, 2017
అజ్మన్ క్రిమినల్ కోర్ట్ ఆసియాకి చెందిన ఇద్దరు మహిళలకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బయటకు పంపివేయనున్నారు. అజ్మన్‌లో బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారంటూ వీరిపై మోపబడిన అభియోగాలు నిరూపించబడ్డాయి. తమ దేశం నుంచి వీరు యువతుల్ని ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి, వారిని మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయించారు. ఈ కేసులో మరో ముగ్గురు ఆసియా మహిళలకు మూడేళ్ళ జైలు శిక్ష, శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ని విధించింది న్యాయస్థానం. ఈ కేసులో మొదటి నిందితురాలు దేశంలో అక్రమంగా నివసిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఆమె నివసిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అజ్మన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ని రెంట్‌కి తీసుకుని, అక్కడే ఆమె వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించింది.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







