అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

- March 14, 2017 , by Maagulf
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. నికోబార్ ఐస్ లాండ్ దీవుల నుంచి ఈ భూకంపం వ్యాప్తి చెందినట్లుగా జాతీయ భూకంపం కేంద్రం ప్రకటించింది.
నికోబార్ ఐస్ లాండ్ దీవుల్లో ఈ ఉదయం 8.21గం.కు సుమారు 10కి.మీ లోతు నుంచి భూమి కంపించినట్లు భూకంపం కేంద్రం పేర్కొంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇక జమ్మూకశ్మీర్ లోని కతువాలోను ఈ తెల్లవారుజాము 5.28గం.కు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com