పాకిస్తాన్ డ్రైవర్నుమెచ్చిన సౌదీ యువరాజు

- March 14, 2017 , by Maagulf
పాకిస్తాన్ డ్రైవర్నుమెచ్చిన సౌదీ యువరాజు

అత్యంత ధైర్య సాహసాలతో, సమయస్పూర్థితో ఓ సౌదీ కుటుంబాన్ని కాపాడిన పాకిస్తానీ డ్రైవర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా సౌదీ యువరాజు సౌద్ బిన్ నయూఫ్ అతడిని సత్కరించి సన్మానించారు. పవిత్ర మక్కాను దర్శించేందుకు సదుపాయం కల్పించారు. మనామాలో ఆదివారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు మంటల్లో చిక్కుకుపోయింది. లోపల ఓ సౌదీ కుటుంబం కాపాడండంటూ వేడుకుంటున్నా.. చాలామంది చుట్టూ చేరి వేడుక చూస్తున్నారు. సెల్‌ఫోన్ తీసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే అటుగా వెళ్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్ మహ్మద్ మన్సూర్ మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. హుటాహుటిన కిందకు దిగి.. వాటర్ ట్యాంక్‌లోని నీటిని కారు మంటలను ఆపేందుకు ఉపయోగించాడు. వారిని బయటకు తీసి.. ప్రాథమిక చికిత్స చేశాడు.. ఈలోపు అక్కడికి వచ్చిన అంబులెన్స్‌లో వారిని దగ్గరుండి ఎక్కించాడు. మన్సూర్ చేసిన సాహస కృత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు పౌరులు. ఇది కాస్తా వైరల్ అయి సౌదీ రియల్ హీరోగా మారిపోయాడు. ఈ విషయం సౌదీ యువరాజు నయూఫ్‌కు తెలిసి.. పాకిస్తాన్‌కు చెందిన మన్సూర్‌ను అభినందనలతో ముంచెత్తారు. తన వద్దకు రప్పించుకుని సన్మానించి, మక్కా యాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశామని తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com