ఎటిసలాట్, డు 'ఉచిత టిక్కెట్స్' ఆఫర్
- September 25, 2015
టెలికాం ఆపరేటర్స్ ఎటిసలాట్, డు వినియోగదారులకు షరతులతో కూడిన ఉచిత రిటర్న్ టికెట్‌లను ఇవ్వనుంది. ఎంపిక చేయబడ్డ ప్రాంతాల నుంచి రిటర్న్ టికెట్ ఆఫర్‌ని ఎటిసలాట్, డు టెలికాం సంస్థలు ప్రకటించాయి. యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం రూపొందించబడింది ఈ సరికొత్త ఆఫర్. కొత్త ప్లాన్స్‌ని ఎంచుకున్న వినియోగదారులు పేర్కొనబడ్డ ప్రాంతాల నుంచి ఫ్రీ రిటర్న్ టిక్కెట్స్‌ని పొందవచ్చు. ఎటిసలాట్ వినియోగదారులు పోస్ట్‌పెయిడ్ 500 ప్లాన్‌ని ఎంచుకుంటే 1,50,000 పాయింట్లు పొందగలుగుతారు. ఈ పాయింట్స్‌తో టిక్కెట్‌ని పొందడానికి అవకాశం ఉంది.నవంబర్ 25 నుంచి 30 మధ్యలో కొచ్చి వెళ్ళడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో 72,054 పాయింట్స్ అవసరమవుతాయి. పాకిస్తాన్‌లోని కరాచీ వెళ్ళడానికి 95,878 పాయింట్స్ అవసరమవుతాయి. పోస్ట్‌పెయిడ్ 150 ప్లాన్‌ని ఎంచుకుంటే 20,000 పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్స్‌తో దుబాయ్‌లోని త్రీస్టార్ హోటల్‌లో రూమ్ పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ 250 ప్లాన్‌తో 50,000 పాయింట్స్ పొందవచ్చు. ఇప్పటికే వివిధ ప్లాన్స్ వినియోగిస్తున్నవారు, వాటిని సస్పెండ్ చేసి, కొత్త ప్లాన్స్ తీసుకుంటేనే పై ఆఫర్స్‌ని పొందగలుగుతారు.
డు సంస్థ ఆఫర్స్ కూడా వినియోగదారుల్ని ఆకర్షించేలానే ఉన్నాయి. ప్లాన్ 300 ఎంచుకుంటే ఎంపిక చేయబడిన ప్రదేశాల నుంచి రిటర్న్ టిక్కెట్స్‌ని పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. బహ్రెయిన్, కువైట్, మస్కట్, డామమ్, ఇస్తాంబుల్, రియాద్, కైరో, అమ్మాన్, బీరుట్, కొలంబో, కేరళ, ఏథెన్స్, మనీలా, లండన్, ప్యారిస్, రోమ్, కీవ్, స్టాక్‌హామ్ మరియు మాస్కో తదితర ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. వ్యక్తిగత వివరాలను, కావాల్సిన ఆఫర్‌నీ, పొందాలనుకున్న టిక్కెట్ వివరాల్ని పొందుపర్చినట్లయితే వారం రోజుల్లో వ్యక్తిగత వోచర్‌ను డు సంస్థ వినియోగదారులకు అందజేస్తుంది. వోచర్ అందిన తర్వాత 48 గంటల్లోగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, అందులో అడిగిన సమాచారాన్ని (అడ్రస్, పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని) పొందుపర్చాల్సి వుంటుంది. ఆ తర్వాత 15 రోజుల్లో ఇమెయిల్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్ వివరాలు వినియోగదారులకు అందుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







