దుబాయ్ వెళ్తున్న గోపీచంద్ 'గౌతమ్ నంద'
- March 14, 2017
గో పీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ కథానాయికలు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్యాచ్ వర్క్ మినహా టాకీ పూర్తయింది. త్వరలో దుబాయ్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌లోని యాక్షన్ కోణాన్ని కొత్తగా చూపించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి గెటప్‌లో గోపీచంద్‌ని ఎప్పుడూ చూళ్లేదని చెబుతున్నారు.
సంపత్‌నంది చిత్రాన్ని స్టైలిష్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈనెల ద్వితీయార్ధంలో దుబాయ్‌లో ఇదివరకెప్పుడూ చూడని కొత్త లొకేషన్లలో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. కథానాయకుడి పరిచయ గీతాన్ని కొత్తగా చూపించబోతున్నాం. ఈ రెండు పాటలకూ రాజు సుందరం నృత్య రీతులు సమకూరుస్తారు.
ఏప్రిల్‌లో మిగిలిన మూడు పాటల్ని హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తామ’’న్నారు. సంగీతం: తమన్
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









