ఖతార్‌లో 7 శాతం పెరగనున్న వాణిజ్య అద్దెలు
- September 25, 2015
ఖతార్‌లో వాణిజ్య అద్దెలు 2017 నాటికి 7 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అల్ అస్మాఖ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ ఈ మేరకు అంచనా వేసింది. 2017 నాటికి పెద్ద సంఖ్యలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి రానున్నాయనీ, ఇప్పటికే అవి నిర్మాణంలో వున్నాయని, అవి అందుబాటులోకి వస్తే 5 నుంచి 7 శాతానికి వాణిజ్య అద్దెల పెరుగుదల నమోదవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. పెట్టుబడిదారులకు ఇదే మంచి తరుణమని పేర్కొన్న ఆ సంస్థ, ఖతార్‌లో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడం ఖాయమని అల్ అస్మాఖ్ చెబుతుంది. కార్యాలయాలు ఎక్కువగా నాలుగు ప్రాంతాల్లోనే ఫోకస్ అయి ఉన్నాయి. వెస్ట్ బే ఎక్కువమంది కోరుకుంటున్న అనువైన ప్రాంతం. గ్రాండ్ హమాద్ స్ట్రీట్, దోహా డౌన్ టౌన్‌లలో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, చిన్న చిన్న కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయి. రింగ్ రోడ్స్ మధ్యతరహా, ఉన్నత తరహా కార్పొరేట్స్ కోసం అనువుగా ఉన్నాయి. అల్ సాద్ కార్పొరేట్స్‌కి అనుకూలం. ముందు ముందు కాలంలో వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఇంకా బాగా విస్తరిస్తుందనీ, అన్ని ప్రాంతాలూ సమానంగా డిమాండ్‌ని కలిగి ఉంటాయని రియల్ ఎస్టేట్ సంస్థలు అంచనా వేశాయి.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







