31 మంది మృతి సిరియాలో ఆత్మాహుతి దాడి
- March 15, 2017
సిరియాలో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రాజధాని డమాస్కస్‌లో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 31 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొదటి ఆత్మాహుతి దాడి రాజధాని డమాస్కస్‌లోని ప్రధాన కోర్టు వద్ద జరిగింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ సూసైడ్ బాంబర్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సూసైడ్ బాంబర్ అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో 31 మంది మరణించారు. లాయర్లు, జడ్జిలు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రెండో ఆత్మాహుతి దాడి నగరంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఈ దాడిలో ఎవరూ మరణించకున్నా.. పలువురికి గాయాలయ్యాయి. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమై ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. అసద్ బలగాలు, ఐసిస్‌ల మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది పౌరులు మరణించారు. సుమారు 4 లక్షల మందికి పైగా పౌరులు దేశాన్ని వదిలిపెట్టిపోయారు. అయినా సిరియా నరమేధం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









