ఓ శుభవార్త సామ్‌సంగ్‌ ఎస్‌8 కొందామనుకుంటున్నవారికి

- March 16, 2017 , by Maagulf
ఓ శుభవార్త సామ్‌సంగ్‌ ఎస్‌8 కొందామనుకుంటున్నవారికి

ఎన్నో ప్రత్యేకతలతో రాబోతున్న సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌8 మొదటి నుంచీ వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ర్యామ్‌ మొదలుకుని డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా వంటి ఎన్నో స్పెసిఫికేషన్లపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారమూ విడుదల చేయని సంస్థ తొలిసారి ఎస్‌8పై ఓ శుభవార్త తెలిపింది. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకురాబోతుంది. వినూత్నంగా ఉండేలా ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 18:9 రేషియోతో ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే కొత్త అనుభూతిని మిగులుస్తుంది. మొబైల్‌ని ఐమూలగా చూసినా స్పష్టంగా కనిపించడమే దీని ప్రత్యేకత.
ర్యామ్‌ 6జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతుంది. నూగట్‌ వర్షన్‌తో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రా హెచ్‌డీ రిజిల్యూషన్‌తో 6.2 అంగుళాల తాకే తెరతో వస్తుంది. వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్‌, బ్యాటరీ 3000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com