గాల్లో పక్షిలా విహరించిన 86 సంవత్సరాల బామ్మగారు..
- March 16, 2017
గాలిలో ఎగరడం, తేలడం, ఈదడం కంటే హాస్యాస్పదమైనది, వెర్రిది ఇంకేదైనా ఉందా అని పద్దెనిమిదో శతాబ్దపు ప్రారంభంలో ఒక రచయిత ప్రశ్నించాడు..కానీ, జీవితమే ఒక ఆట... సాహసమే నా బాట... నాలో ఊపిరి ఉన్నంతవరకు ఇలానే చేస్తానని ఓ 86 సంవత్సరాల బామ్మగారు భీష్మశపధం చేస్తున్నారు. తన చిన్ననాటి నుండి నెరవేరని ఒక ముచ్చటను ఎట్టకేలకు బహెరిన్ లో సాధ్యం చేసుకొన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన ప్యాట్రిసియా రిచర్డ్ సన్ అనే వృద్ధ మహిళ గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగు వద్ద గాలిలో ఎగురుతూ సాహస ప్రదర్శన చేసింది.ఆమె ధైర్యం చూసి స్థానిక ప్రేక్షకుల మరియు గ్రావిటీ కేంద్రం వద్ద మొత్తం జట్టు అభిమానాన్ని ఆమె పొందారు." ఇక్కడ ప్రతి వ్యక్తి ఎగిరేందుకు తగినట్లుగా ఉంది. ఇటువంటి ఇండోర్ స్కైడైవింగు ఎంతో చక్కని అనుభూతి కల్గిస్తుంది. ఉత్తేజకరమైన చర్యల ద్వారా ఇక్కడ ఆ సాహసాన్ని సాధించవచ్చు ఆ అద్భుతమైన విన్యాసం నెరవేర్చుకోవచ్చు, ఆమె చెప్పారు. ప్యాట్రిసియా యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఆమె బహెరిన్ లో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నతన కుమారుడిని చూసేందుకు ఆమె వచ్చారు. బహరేన్ లో ఉన్న గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగు ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆమెకు తానూ ఆ సాహసం ఎందుకు చేయకూడదనే బలమైన కాంక్ష రగులుకోవడంతో ప్రపంచం లోనే ఎత్తైన గాలి నింపబడిన గాజు సొరంగంలో ఈ సాహసం చేయడానికి సిద్ధమైపోయింది..అందుకు తన కుమారుడు సైతం ప్రోత్సాహించడంతో ప్యాట్రిసియా తన ముచ్చట తీర్చుకొన్నారు. ఆమె ఈ వయస్సులోనూ ఈత మరియు యోగా క్రమం తప్పకుండా చేస్తుంది. ఏదో ఒక సాహసం చేయాలని బలమైన ఆకాంక్ష ఈ కార్యానికి పురిగొల్పింది. శిక్షణ జట్టు నాకు ఎంతో చక్కని శిక్షణ శ్రద్ధగా ఇచ్చారు..ముఖ్యంగా నా శిక్షకుడు నా వయస్సుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఎగిరే విధంగా శిక్షణ ఇవ్వడంతో ఇది సాధ్యమైందని ఆమె తన అనుభవాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









