ఉగ్ర హెచ్చరికలు తాజ్‌మహల్‌కు
- March 16, 2017
అద్భుత చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై దాడి చేపడతామని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుకూల వార్తా విభాగం హెచ్చరించింది. తాజ్‌మహల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్న ఓ గ్రాఫిక్స్‌నూ విడుదలచేసింది. ఐఎస్ కార్యకలాపాలపై నిఘా పెట్టే ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్’ ఈ విషయాలను వెల్లడించింది. ఐఎస్ మీడియా విభాగం ‘అహ్వాల్ ఉమాత్’ ఓ ముష్కర యాప్‌లో గత మంగళవారం పెట్టిన ఈ గ్రాఫిక్స్‌ను సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీనిలో ‘న్యూ టార్గెట్’అని రాసివుంది. ఆత్మాహుతి దాడి చేపడతామనే అర్థంవచ్చే అరబిక్ పదాలూ పక్కనవున్నాయి. భారత్‌లో దాడులు చేపడతామని ఐఎస్ అనుకూల వార్తా సంస్థలు హెచ్చరించడం ఇదేమీ తొలిసారికాదు.
లఖ్‌నవూలో ఈ నెల 8న అనుమానిత ఉగ్రవాది సైఫుల్లాను పోలీసులు హతమార్చిన సంగతి తెలిసిందే. అతణ్ని భారత్‌లోని ఖలీఫా సైనికుడిగా ఓ ముష్కర వార్తా సంస్థ పేర్కొంది. అతడి చిత్రాన్నీ ప్రచురించింది. అయితే ఈ చిత్రాన్ని అంతకుముందురోజే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విడుదలచేయడం గమనార్హం.
సైఫులా ఐఎస్ ఉగ్రవాది కాకపోవచ్చని, తనకుతానుగానే ఉగ్రవాదంపైపు అతడు ఆకర్షితుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







