నగ్నత్వం...!!

- March 16, 2017 , by Maagulf

నట్టింట నలుగురు నడయాడుతున్నా
నాకంటూ ఎవరూలేరని పదే పదే
గుర్తు చేస్తున్న ఎడారి బతుకు
ఏకాకితనాన్ని ఎత్తి చూపిస్తుంటే
ఒప్పుకోలేని నపుంసకత్వం
హింసత్వంలో అనుభవించే
పైశాచికానందాన్ని ఆస్వాదిస్తూ
ఆత్మీయంగా  దగ్గరవుతున్న
అనుబంధాన్ని అల్లరిపాలు చేసి
మనిషికే కాదు మనసు విలువకు
సమాధి కట్టి జీవశ్చవాన్ని మిగిల్చి
అమ్మదనపు నగ్నత్వాన్ని నడిబజారులో
నిలబెడుతున్న విటుల విశృంఖల
విరాట పర్వాలకు తెర పడేదెన్నడో..!!

--మంజు యనమదల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com