నిండా ముంచిన మోడీ తెలుగు రాష్ట్రాల ప్రజలను

- March 16, 2017 , by Maagulf
నిండా ముంచిన మోడీ తెలుగు రాష్ట్రాల ప్రజలను

తెలుగు రాష్ట్రాల ప్రజలను మోడీ ముంచడం ఏంటని ఆలోచిస్తున్నారా..? అవును నిజం తెలుగు రాష్ట్రాల ప్రజలను మోడీ మోసం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు రుణ మాఫీ చేస్తామని హాపీ ఇచ్చిన మోడీ ఆ తర్వాత మావల్ల కాదంటూ చేతులు ఎత్తేసారు. మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతుల రుణ మాఫీ చేతామని హామీ ఇచ్చి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసి యూపీ అధికారాన్ని సొంతం చేసుకుంది కమల దళం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారు.
కారణం తెలుగు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వమే అధికారంలో ఉండడం.
దేశ ప్రధాని స్థానంలో ఉన్న మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన మోడీ రాష్ట్రాలపై వివక్ష చూపడం ఆయన పదవికి ఇది ఎంత మాత్రం తగదని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ ప్రధాని హామీ ఇచ్చిన ఉత్తర ప్రదేశ్‌కే పరిమితం చేయకుండా దేశమంతటా అమలు చేయాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే.. తన 90 నిమిషాల ప్రసంగంలో ఎక్కడా రాధామోహన్‌ సింగ్‌ ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీని కేంద్రం భరించే ప్రస్తావనే తేకపోవడం గమనార్హం.
దీంతో.. ''మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రా? లేక యూపీకా?'' అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ''వ్యవసాయ రుణాల మాఫీ వల్ల రుణగ్రహీతల్లో (అంటే రైతుల్లో) క్రమశిక్షణ కట్టు తప్పుతుంది. ఒకసారి ఇలాంటి మాఫీ పొందినవారు తదుపరి కూడా ఇదే తరహా మాఫీలుంటాయన్న ఆశతో భవిష్యత్తు రుణాలను కూడా చెల్లించకుండా ఎగవేస్తారు. మున్ముందు తీసుకునే రుణాల మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకూ ఎదురుచూస్తారు. దీనివల్ల క్రమశిక్షణ దెబ్బతినడం ఖాయం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com