యుఎఇ లోని చట్టాలపై భారతీయులకు సలహాలు మరియు సూచనలు

- March 17, 2017 , by Maagulf
యుఎఇ లోని చట్టాలపై భారతీయులకు సలహాలు మరియు సూచనలు

కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్

యుఎఇ లోని చట్టాలపై భారతీయులకు సలహాలు మరియు సూచనలు

 

తొలిపరిచయం:

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని స్థానిక చట్టాలు, పరిపాలనావిధానాలు భారతదేశంలో నివసిస్తున్నవారితో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ నివసిస్తున్న విభిన్నజాతీయతలుకల పౌరులకు క్షేమమైన, సౌకర్యవంతమైన నివాసానికిగాను ఈచట్టాలు కఠినంగా అమలు పరచబడి ఉన్నాయి. అందుకని యు.ఎ.ఇ కి రావడానికి మునుపే వీటిని అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నదని సలహా ఇవ్వడమైనది. అత్యంత ముఖ్యమైనవి కొన్ని దిగువ ఇవ్వడం జరిగింది.

 

A. యుఎఇ లోనికి ప్రవేశం:

1. పర్యాటకులకు యుఎఇ లోనికి ప్రవేశానికి / తిరిగివెళ్ళుటకు న్యాయబద్ధమైన ప్రవేశానుమతులను కలిగి ఉండాలి. ఒక వేళ ప్రవేశానికి అనర్హత ఉన్న యెడల లేదా చెల్లించని ఋణాలు లేదా పిల్లల సంరక్షణకు సంబంధించిన విభేదాలు ఉన్నట్లయితే దేశాన్ని విడిచిపెట్టడం నిషేధించబడుతుంది.

2. ప్రయాణికులు ఎవరైతే యుఎఇ లో పరిష్కారం కానీ నెరసంబంధ చర్యలకు లోనై యుండి మరియు చెల్లించని ఋణాలు కలిగి ఉన్నట్లయితే (ఎటువంటి సమయంలోనైనా) విమానాశ్రయంలో నిర్బంధించవచ్చు, అలాగే ట్రాన్సిట్ లో ఉన్నాకూడా ప్రయాణికులను నిర్బంధించబడును.

3. అశ్లీల చిత్రాలు కలిగిన మెటీరియల్ ను కలిగియుండుట యుఎఇ లో చట్టరీత్యా నేరం.

4. అంతేకాక అంతర్జాలంలో ఇతరులను దూషించడం, సాంఘిక మాధ్యమాలలో ఇతరులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, తిట్టడం, బెదిరించడం చట్టబద్దం కాదు. ఇలాంటివాటికి జరిమానా, జైలు శిక్ష మరియు దేశబహిష్కరణ ఉంటుంది. తగలబడిపోతున్న భవనాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం లాంటి దృశ్యాలను చిత్రీకరించి వాటిని సాంఘిక మాధ్యమాలలో పెట్టడం లాంటివి ఇక్కడ నేరాలుగా పరిగణించబడుతాయి. అదేవిధంగా ఇతరుల నుండి అనుమతిలేని వారి వ్యక్తిగత విషయాలను అంతర్జాలంలో ఉంచడం లాంటి వాటికి కూడా ఇక్కడ శిక్షలు ఉంటాయి.

 

B. ట్రాఫిక్ / డ్రైవింగ్ కొరకు చట్టాలు:

5. యుఎఇ లో ట్రాఫిక్ మరియు డ్రైవింగ్ నియమాలు చాలా కఠినంగా అమలు చేస్తారు. ఎటువంటి పరిస్థితులలో కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం.

6. మద్యంతాగి వాహనాలను నడపడం చట్టబద్దమైన నేరం.

7. ఎవరైతే వాహనాలు నడుపుతూ అవతలి వారిని ప్రమాదాలకు గురిచేస్తారో అటువంటివారిని ప్రమాదానికి గురైనవారు వైద్యశాల నుండి బయటకు వచ్చేవరకు కారాగారం లో ఉంచబడుదురు. ఒకవేళ ఎవరైనా రోడ్డుప్రమాదంలో చనిపోతే ప్రమాదానికి గురిచేసిన వ్యక్తి నష్టపరిహారం చెల్లించాల్సివస్తుంది. దీనిని 'దియ్యా' అని పిలవబడుతుంది.

8. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనం నడపడం, మరియు సూచనలు సంజ్ఞలు లేకుండా వాహనాన్ని నడపడం వల్ల కారాగారానికి వెళ్ళవలసిరావచ్చు.

 

C. మాదకద్రవ్యాలు మరియు మద్యపానం:

9. మాదకద్రవ్యాలు మరియు మద్యపాన వినియోగం పై యు.ఎ.ఇ లో కఠినమైన చట్టాలుంటాయి. మాదకద్రవ్యాలు కలిగియుండటం, ఉపయోగించడం, రవాణా చేయడం (గంజాయి విత్తనాలతో సహా) చట్టరిత్యానేరం. దీనికి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు.

10. యు.ఎ.ఇ లో మరియు యు.ఎ.ఇ కి అవతలకూడా మాదకద్రవ్యాలను ఉపయోగించడం చట్టరీత్యా నేరంగా ఇక్కడి అధికార వర్గాలు పరిగణిస్తాయి. వీటి ఉపయోగాన్ని నిరూపించడానికి సాక్ష్యాలుగా రక్తం, మూత్రం నమూనాలను సేకరించి నిరూపితమైతే కనీసం నాలుగేళ్ల జైలుశిక్ష మరియు దేశబహిష్కరణ చేయడం జరుగుతుంది.

11. బహిరంగంగా మద్యం సేవించడం మరియు జనసమూహ ప్రాంతాలను కలుషితం చేయడం చట్టరీత్యా నేరం.

12. భారతదేశంలోని మందులషాపులలో లభించే సాధారణ మందులు ఉదాహరణకు ట్రమాడల్, పారాసెటమాల్, కొడీన్, గంజాయి విత్తనాలు మొదలైనవి యు.ఎ.ఇ లో నియంత్రించబడిన పదార్ధాలుగా భావించబడుతున్నాయి. ఒకవేళ ఏ ప్రయాణికుడైనా ఇటువంటివాటికి కావలసిన అనుమతి పత్రాలను కలిగి ఉండనట్లయితే యు.ఎ.ఇ చట్టాలకు లోబడి జైలు శిక్షకు గురికాబడతారు. కనుక యు.ఎ.ఇ అధికారవర్గాల సలహాలననుసరించి స్థానికంగానే మందులను కొనుగోలు చేయవలసి ఉంటుంది.

13. యు.ఎ.ఇ కి రావడానికి మునుపే ప్రతిప్రయాణికుడు కూడా యు.ఎ.ఇ నియంత్రించిన, నిషేధించిన / అదుపుచేయబడిన మందుల జాబితాను పరిశీలించడం చాలా మంచిది. ఈ జాబితాను యు.ఎ.ఇ మంత్రిత్వంలోని ఆరోగ్యశాఖ యొక్క వెబ్ సైట్ నుండి చూడగలరు.

 

D. ఉద్యోగమూ మరియు ఆర్ధికపరమైనవి:

14 . ఆర్థికపరమైన నేరాలు, మోసం, చెల్లని చెక్కులు ఇవ్వడం (పోస్ట్ డేటెడ్ మరియు సెక్యూరిటీ చెక్కులతో కలిపి), మరియు బిల్లులు చెల్లించకపోవడం (హోటల్ బిల్లులతో కలిపి) ఇటువంటి వాటిని చాలా తీవ్రమైన ఆర్ధిక నేరాలుగా పరిగణించబడి ఫలితంగా జైలు శిక్షకు లేదా జరిమానాను గురి కావాల్సి ఉంటుంది. అంతేకాక ఇలాంటి నేరాలకు వారి బ్యాంకు ఖాతాలు మరియు ఇతర ఆస్తులను స్తంభింపచేయబడతాయి.

15 . వ్యక్తిగత అప్పులు తీర్చుటకు లేదా వ్యాపారంలోని అప్పు తీర్చుటకు, గ్యారంటీ కొరకు బ్యాంకు కు ఇవ్వబడిన వ్యక్తిగత చెక్కులు బ్యాంకులో సరైన నిల్వ లేకుండా ఇవ్వకూడదు. ఆలా ఇచ్చినట్లయితే చల్లనిచెక్కులు ఇచ్చినందుకు గాను శిక్షకు గురికాబడుదురు.

16 . రెండవ పార్టీవారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పర్యాటకులు లేదా వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్ళడానికి నిరాకరించబడుదురు మరియు అరెస్ట్ కూడా చేయబడవచ్చు. బాకీదారులను వారి బాకీలు తీర్చేవరకు చెరసాలలో ఉంచ బడుదురు లేదా ఇరువర్గాల వారు ఋణ ఒప్పంద పత్రము రాసుకోవచ్చు.

17 . ఏదైనా ఉద్యోగం ప్రారంభించబోయేముందు అది ఏ ఉద్యోగమైనా అందులోని నియమనిబంధనలను అర్థంచేసుకోవాలి. అంతేకాక ఆ సంస్థ చెల్లించని చెల్లింపులను మరియు ఆ సంస్థలో జరుగు కార్యకలాపాలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఉద్యోగ ఉప్పంది పత్రాలు మరియు దీనికి సంబంధించిన వివరములు కొరకు ఇక్కడ చెక్ చేయండి.

http://www.mohre.gov.ae/en/labour-law/labour-law.aspx

18 . ఉద్యోగస్తుని పాస్ పోర్ట్ ని స్పాన్సర్ తన దగ్గర ఉంచుకోవడం ఆచారం. కాని యు.ఎ.ఇ ప్రభుత్వం ప్రకారం చట్టబద్దం కాదు. దీనికొరకు యు.ఎ.ఇ  ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచియున్నది.

క్రింది ఇవ్వబడిన వెబ్ లింక్స్ యు.ఎ.ఇ  యొక్క చట్టాలను మరింతగా వివరిస్తాయి.

http://www.uaeinteract.com/travel/drugs.pdf

http://dubai.ae/en/Lists/HowToGuide/DispForm.aspx?ID=6

http://www.dubaiairports.ae/before-you fly/procedures/security-customs

http://gulfnews.com/keep-banned-drugs-off-travel-kit-1.442006

http://dubai.ae/en/Lists/HowToGuide/DispForm.aspx?ID=6

https://www.dubai-international-airport.com/

 

 

యు.ఎ.ఇ లో నివసిస్తున్నవారు / విహారయాత్రకు వెళ్తున్నవారు చేయతగినవి మరియు చేయకూడనివి:

 

చేయతగినవి

చేయకూడనివి

1. యు.ఎ.ఇ లో ఉన్నప్పుడు పాస్ పోర్ట్ మరియు వీసా చాల విలువైన పత్రాలుగా పరిగణించాలి.

1. బ్యాంకులో ఇచ్చిన చెక్కుకు సరిపడా నగదు లేకపోతె చెక్కు ఇవ్వొద్దు.

2. చెక్ బుక్స్, క్రెడిట్ కార్డులు, ఇతర ఆర్ధిక పరమైన పత్రాలు మీ వ్యక్తిగత రక్షణలో ఉంచుకోవాలి. ఇటువంటి పత్రాలను ఎవరైనా దుర్వినియోగ పరిస్తే అసలైన ఖాతాదారుడు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది.

2. మహిళలతో అమర్యాదగా ప్రవర్తించరాదు. మహిళలను అదేపనిగా చూడటం దురుద్దేశంతో తాకడం, కామెంట్స్ చేయడం లాంటివి నేరంగా మరియు వేధింపులకు గురిచేయడంగా భావిస్తారు.

3. యు.ఎ.ఇ లో ప్రజల యొక్క మతము ఇస్లాం. ప్రతిఒక్కరు ముస్లింలను గౌరవించాలి. రోజుకు ఐదుసార్లు ప్రార్ధన చేయాలి.

3. మహిళలను, కుటుంబాలను, ప్రభుత్వ భవనాలను ఫోటోలను తీయరాదు.

 

4. యు.ఎ.ఇ లోని చట్టాలను మరియు అవి వ్యక్తులపై, వారి పరిస్థితులపై ఎలా ప్రభావితం చూపుతాయో యు.ఎ.ఇ లోకి అడుగుపెట్టకముందే అర్ధంచేసుకోవాల్సి ఉంటుంది.

4. యు.ఎ.ఇ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారి జాబితాలోని నియత్రించబడిన మందులను గమనించి అలాంటివాటిని ఉంచుకొనరాదు.

5. పాదచారులు వారికి ఉద్దేశించిన గుర్తులపైనే నడవాలి. ఎందుకంటే అన్నివాహనాలు వారిని రోడ్డు దాటటానికి అవకాశం కల్పించకపోవచ్చు.

5. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మరియు మద్యపానం సేవించి వాహనం నడపరాదు.

6. ఉద్యోగం ప్రారంభించక ముందే వర్క్ పర్మిట్ ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుండి పొందాలవలసి ఉంటుంది.

6. అడుక్కోవడం యు.ఎ.ఇ లో నిషేధం.

7. యు.ఎ.ఇ కి ప్రయాణించడానికి ముందే ట్రావెల్ ఇన్సూరెన్సు తీసుకోవాలి. అది అవసరమైన వైద్యఖర్చులను భరించేదిగా మరియు మెడికల్ ఎవాక్యూయేషన్ ను కవర్ చేసేదిగా ఉండాలి.

7. ఇస్లాం మతం అంటే అయిష్టంగా ఉండకూడదు అలాగే కుటుంబమంటే కూడా అయిష్టాలు పనికిరాదు.

8. యు.ఎ.ఇ జాతీయ చిహ్నాలను మరియు ఇతర జాతీయ చిహ్నాలను గౌరవించాలి.

8. స్థానిక సంఘటనలు, అగ్ని ప్రమాదానికి గురైన భవనాల ఫోటోలు, ఇలాంటివి సాంఘిక మాధ్యమాలలో పెట్టడం నేరం. అందుకే యు.ఎ.ఇ లో పర్యటించేవారు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.

9. ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసములో ఉపవాస సమయమునందు కన్సిడరేషన్ చూపించవలెను. బహిరంగ ప్రదేశాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తినుట, తాగుట, పొగతాగుట నిషేధించబడి ఉన్నది.

9. బ్యాంకులో నగదు నిల్వలేకుండా చెక్కులు ఇవ్వడం, బిల్లులు కట్టకుండా ఉండటం లాంటివి చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. దీనికిగాను జైలుశిక్ష మరియు జరిమానా విధిస్తారు.

10. ఎల్లప్పుడూ గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవలెను.

10. ఎటువంటి మోసపూరిత కార్యకలాపాలలో పాలుపంచుకోరాదు (ఉదాహరణకు బ్యాంకు ఖాతాలలో నగదు లేకుండా చెక్కులు ఇవ్వడం, బిల్లులు చెల్లించక పోవడం లాంటివి) ఇవి చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడి జైలుశిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.

11. యు.ఎ.ఇ ని విడిచి వస్తున్నట్లయితే వర్క్ వీసా ను రద్దు చేసుకోవాలి. అంతేకాక బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఫోన్ సౌకర్యాలను రద్దు చేసుకోవలసి వస్తుంది.

 

11. పెళ్ళికి ముందే సెక్స్, పెళ్లి తరువాత ఇతరులతో శారీరక సంబంధాలు, పెళ్ళికాకుండా కలిసి ఉండటం, స్వలింగ సంపర్కం, ఆడవారు మగవారి దుస్తులను, మగవారు ఆడవారి దుస్తులను ధరించడం వంటివి చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడుతాయి. దీనికి జైలుశిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.

 

 

బాధ్యతాపరమైన అంశం: ఇందులో వివరించిన సలహాలు సూచనల యొక్క ఖచ్చితత్వాన్ని ఖచ్చితంగా వివరించడానికి అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ వీటిని లీగల్ పర్పస్ కు ఉపయోగించరాదు. వీటిని అనుకరించడంవలన ఎదురయ్యే ఖర్చులకు, నష్టలాభాలకు (నేరుగా / నేరుగాకాకుండా) కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్ ఎటువండి భాద్యత వహించదు. దీనికిగాను నిష్ణాతులైన నిపుణుల సలహా తీసుకోవలసినదిగా సూచించడమైనది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com