5 నుండి 8 ఏళ్ళ వయసున్న పిల్లల కోసం కదిలే బండ్లని ఓఎఎ పరిచయం

- March 17, 2017 , by Maagulf
5 నుండి 8 ఏళ్ళ వయసున్న పిల్లల కోసం కదిలే బండ్లని ఓఎఎ  పరిచయం

 5 నుండి 8 ఏళ్ళ వయసున్నపిల్లల కోసం కదిలే బండ్లని (గో -కార్ట్స్)  ఆటోమొబైల్స్ అసోసియేషన్ ( ఓఎఎ ) కొనుగోలు చేసింది. మంగళవారం ఓఎఎ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అల్ రాఫ్డ్ ఫండ్ సీఈఓ తారిక్ బిన్ సులైమాన్ అల్ ఫార్సీ ఆధ్వర్యంలో ఈ ప్రయోగ కార్యక్రమం జరిగింది. దీనికి అధికారులు, మీడియా సిబ్బంది మరియు క్రీడా కారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఓఎఎ  డైరెక్టర్ల బోర్డు యొక్క ఉపాధ్యక్షుడు బ్రిగేడియర్ జమాల్ బిన్ జాడి అల్ తాయి మాట్లాడుతూ బాల్యం నుంచే ట్రాఫిక్ భద్రత పై పిల్లలకు ఆహ్లాదంతో కూడిన  అవగాహన కల్పించడం ఒక విధానం కాగా అదనంగా ఆ వయస్సులో పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి  దోహదపడుతుందని ఆయన వివరించారు.పిల్లలలో ట్రాఫిక్ భద్రతపై పరిజ్ఞాన భావాన్ని మెరుగుపర్చే కార్యక్రమంగా దీనిని అభివర్ణిస్తూ మస్కట్ స్పీడ్ సర్క్యూట్, ఓఎఎ  మేనేజర్ లోని బిన్ జాఫర్  అల్ బెంగాలీ ఈ సందర్భంగా తెలిపారు.సర్క్యూట్పై ప్రజంటేషన్ మరియు ఉపయోగపడే పది కొత్త గో కార్ట్స్ పనితీరు గురించి  వివరించారు.ఓఎఎ జనరల్ మేనేజర్  సులైమాన్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రావాహి ముఖ్య అతిథిగా పాల్గొని  కార్ట్స్ పని తీరు గూర్చి అవలోకనాన్నికల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com