రోజర్ ఫెదరర్ అభిమానుల కోసం పాట పాడారు
- March 18, 2017
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియన్ వెల్స్ టోర్నీ అనంతరం బ్రేక్ తీసుకున్న రోజర్ ఫెదరర్ అభిమానుల కోసం ఓ పాట పాడాడు. బాయ్ బ్యాండ్ అంటూ తాను పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
అందులో ఫెదరర్ మరికొంత మంది టెన్నిస్ ఆటగాళ్లతో కలిసి పాట పాడాడు. టామీ హాస్, దిమిత్రోవ్, జకోవిచ్‌లు కూడా ఫెదరర్‌కు తోడుగా గొంతు కలపడం విశేషం. టెన్నిస్ ప్లేయర్లు ఆలపించిన గీతానికి గ్రామీ అవార్డు గ్రహీత డేవిడ్ ఫోస్టర్ పియానో అందించారు. ప్రస్తుతం ఇండియన్ వెల్స్ టోర్నీలో ఫెదరర్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







